Actor Sharwanand | జైలర్‌తో వీరవిహారం చేస్తున్న రజనీ త్వరలోనే జై భీమ్ దర్శకుడితో సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయిపోయాయి. ఇక రేపో మాపో సెట్స్‌మీదకు కూడా వెళ్లనుంది. అమితాబ్ సైతం ఈ సినిమాలో ఓ కీలకపాత్ర చేయనుండటంతో జనాల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ నెలకొంది. ఇక శర్వా కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు వస్తున్న వార్తలు అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ శర్వా ఏ రోల్ చేయబోతున్నాడంటూ అప్పుడే నెట్టింట చర్చలు కూడా మొదలయ్యాయి. తాజాగా వీటికి ఓ కంక్లూజన్ దొరికినట్లు చెన్నై టాక్.
ఈ సినిమాలో శర్వా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఎంతటి హీరో అయినా.. తమ కెరీర్లో ఒక్కసారైనా విలన్ పాత్ర చేయాలని ఆశపడుతుంటారు. అలాంటి ఆఫరే తలుపు తడితే శర్వా మాత్రం కాదంటాడా. అది కూడా రజనీ సినిమాలో అనగానే అంతకంటే అదృష్టం ఏముంది అనుకుంటున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్తలు మాత్రం చెన్నై మీడియాల్లో తెగ వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఆఫర్ ముందుగా నానికి వచ్చిందట. అయితే అప్పటికే నాని వి సినిమాలో విలన్ రోల్ చేసి చేతులు కాల్చుకున్నాడు. దాంతో మరోసారి అలాంటి సాహసం చేయాలేనని మేకర్స్‌కు కరాకండిగా చెప్పినట్లు సమాచారం.
ఏదైతేనేం తొలిసారి శర్వాను నెగెటివ్ రోల్లో చూడబోతున్నాం అనే ఫీలింగే కొత్తగా అనిపిస్తుంది. ఈ మధ్యనే ఎన్నో ఏళ్ల తర్వాత ఒకే ఒక జీవితం సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఇక దాన్ని కాపాడుకునే కసిలో శ్రీరామ్ ఆదిత్య చెప్పిన ఓ కామెడీ థ్రిల్లర్ కథకు ఒకే చెప్పేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగమేఘాల్లో జరుగుతుంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా మరో లెవల్లో ఉండబోతుందని, శర్వా కెరీర్‌ను మరొ మెట్టు ఎక్కిస్తుందని తెలుస్తుంది. పీపుల్ మీడియా బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ స్వరాలు సమకూర్చుతున్నాడు.