ప్రస్తుతం హీరో శర్వానంద్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో అభిలాష్‌రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఒకటి. ఇందులో ఆయన బైక్ రైడర్‌గా కనిపించనున్నారు. మాళవికా నాయర్ కథానాయిక. ఈ సినిమాకు ‘రేస్ రాజా’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. అలాగే బ్లాక్బాస్టర్ ‘సామజవరగమనా’ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా సమాచారం మేరకు ఈ సినిమా విడాకుల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇందులో కోర్ట్ డ్రామా ఆసక్తికరంగా, హైలైట్‌గా నిలుస్తుందట. సంయుక్త మీనన్, సాక్షి వైద్య ఇందులో కథానాయికలు. వీటి తర్వాత సంపద్నందితో కూడా ఓ సినిమా చేయాల్సివుంది.