Nari Nari Naduma Murari Teaser | టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్ ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ఉంది. శర్వానంద్ హీరోయిన్ సాక్షి వైద్యను ప్రేమించి, పెళ్లికి సిద్ధమవుతాడు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న తరుణంలో.. అతని ఆఫీస్‌లోకి కొత్త టీమ్ లీడర్‌గా సంయుక్త మీనన్ ఎంట్రీ ఇస్తుంది. అయితే ఆమె మరెవరో కాదు, హీరోకి ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్. అయితే తన పెళ్లి ఆగిపోకుండా ఉండటానికి హీరో పడే పాట్లు, ఇద్దరమ్మాయిల మధ్య చిక్కుకుని అతను పడే ఇబ్బందులు నవ్వులు పూయిస్తున్నాయి. శర్వానంద్ కామెడీ టైమింగ్, ముఖ్యంగా సత్య మరియు సునీల్‌తో కలిసి చేసే హంగామా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.