Sharwanand | శర్వానంద్ నాలుగో తప్పు చేశాడా..?
శర్వానంద్ , సిద్దార్థ్ (Siddharth) హీరోలుగా వచ్చిన సినిమా మహాసముద్రం (mahasamudram). శర్వానంద్ కొన్నిసార్లు కథల ఎంపికలో తప్పటడుగు వేస్తాడన్న టాక్ కూడా ఉంది.

కొత్త కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలు చేసే యాక్టర్లలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు (Tollywood) యువ హీరో శర్వానంద్ (Sharwanand). శర్వానంద్ , సిద్దార్థ్ (Siddharth) హీరోలుగా వచ్చిన సినిమా మహాసముద్రం (mahasamudram). అనూ ఇమ్మాన్యుయేల్, అదితీ రావు హీరోయిన్లుగా నటించారు. అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వం వహించాడు. శర్వానంద్ కొన్నిసార్లు కథల ఎంపికలో తప్పటడుగు వేస్తాడన్న టాక్ కూడా ఉంది. ఈ సినిమాతో ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు కొందరు ట్రేడ్ పండితులు.
శర్వానంద్ ట్రాక్ రికార్డు చూస్తే కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్ లో వచ్చే సినిమాలు అతనికి సరిగ్గా సెట్ అవుతాయి. సీరియస్ కథాంశాలు అంతగా వర్కవుట్ కావు. శర్వానంద్ గెటప్ విషయంలో కాని, ముఖ హావభావాలను పలికించడంలో కానీ ప్రతీ సినిమాలో దాదాపు ఒకేలా కనిపిస్తుంటాడు. డిఫరెంట్ జోనర్ లో వచ్చిన జాను, మహాసముద్రం చిత్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. అయితే శర్వానంద్ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఆ ప్రభావం నిర్మాతల మీద కూడా పడుతుందట. గతంలో మూడు తప్పులు చేసిన శర్వానంద్..ఇపుడు నాలుగోది కూడా చేశాడని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.
గతంలో రణరంగం చిత్రానికి నిర్మాత నాగవంశీకి రూ.8 కోట్లు నష్టం వచ్చింది. ఆ తర్వాత పడి పడి లేచె మనసు సినిమాకు నిర్మాత సుధాకర్ రూ.10 కోట్ల నష్టాన్ని చవిచూశారు. శ్రీకారం చిత్రాన్ని నిర్మించిన రామ్ ఆచంట రూ.8 కోట్ల నష్టం మూటగట్టుకున్నాడు. తాజాగా మహాసముద్రం ఆశించిన స్థాయిలో ముందుకెళ్లకపోవడంతో మరి ఈ మూవీ నిర్మాత అనిల్ సుంకరకు ఏ స్థాయిలో నష్టాలను తెచ్చిపోతుందోనని అంచనాలు వేసుకుంటున్నారు సినీ జనాలు.
ఇది కూడా చూడండి
చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం: మంచు విష్ణు
Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Rowdy Boys | కలర్‌ఫుల్ పాటతో చిత్రీకరణ పూర్తి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

