శర్వా38లో డింపుల్
హీరో శర్వానంద్ కెరీర్లో తొలి పానిండియా సినిమాకు రంగం సిద్ధమైంది. సంపత్‌నంది దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
హీరో శర్వానంద్ కెరీర్లో తొలి పానిండియా సినిమాకు రంగం సిద్ధమైంది. సంపత్‌నంది దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న ఈ పానిండియా సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇందులో ఓ క్రూషియల్ రోల్ కోసం డింపుల్ హయాతిని ఎంపిక చేశారు దర్శకుడు సంపత్‌నంది.
కథలో చాలా కీలకంగా ఈ పాత్ర ఉంటుందని, ఈ పాత్రకు డింపుల్ పర్ఫెక్ట్గా సరిపోతుందని మేకర్స్ చెబుతున్నారు. 1960లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన యధార్థ గాధ ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని, తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: లక్ష్మీ రాధామోహన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

