అరవైఏళ్ల వృద్ధుడి కథ

దివంగత బాలీవుడ్ అగ్రనటుడు రిషికపూర్ నటించిన చివరి చిత్రం ‘శర్మాజీ నామ్కీన్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. రిషికపూర్ 69వ జయంతి సందర్భంగా శనివారం చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆయన తనయ రిద్దిమా కపూర్ విడుదలచేసింది. ఈ పోస్టర్లో సూట్‌కేస్ పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ రిషికపూర్ కనిపిస్తున్నారు. అరవై ఏళ్ల వృద్ధుడి కథాంశంతో సున్నితమైన ఉద్వేగాల కలబోతగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే రిషికపూర్ మరణించారు. అతడి పాత్రలో పరేష్రావేల్ను తీసుకొని మిగతా షూటింగ్‌ను పూర్తిచేశారు. ‘రిషికపూర్‌ను ఆరాధించి గౌరవించే కోట్లాది మంది అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే బహుమతిగా ఈ సినిమా ఉంటుంది’ అని రిద్దిమా కపూర్ చెప్పింది. ఈ చిత్రానికి హితేష్భాటియా దర్శకత్వం వహించారు. అనారోగ్య కారణాలతో గత ఏడాది రిషికపూర్ కన్నుమూసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

