Shanmukh Jaswanth | యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ సాంగ్స్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు షణ్ముఖ్ జస్వంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే వైష్ణవి అనే యువతిని వివాహం చేసుకున్న షణ్ముఖ్.. ఇప్పుడు హాస్పిటల్ బెడ్‌పై కనిపించడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.జూన్ 21న తిరుమలలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో షణ్ముఖ్ జస్వంత్, వైష్ణవి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకను ఎంతో సాదాసీదాగా నిర్వహించారు.ఆ తర్వాత విశాఖపట్నంలో కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ కూడా నిర్వహించినట్లు సమాచారం. పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉండగా, తాజాగా షణ్ముఖ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోను షేర్ చేశారు. చేతికి సెలైన్ ఎక్కించుకున్న ఆ ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు.ఏం జరిగిందనే విషయాన్ని ఆయన వెల్లడించకపోవడంతో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. షణ్ముఖ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.పెళ్లి వేడుకలు, రిసెప్షన్ కార్యక్రమాల హడావిడి, వరుస కార్యక్రమాల కారణంగా అలసట, డీహైడ్రేషన్ లేదా నీరసం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా వెలువడలేదు.
హాస్పిటల్ ఫోటోను షేర్ చేసినప్పటికీ తన ఆరోగ్య పరిస్థితి గురించి షణ్ముఖ్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. షణ్ముఖ్ లేదా ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా స్పందించిన తర్వాతే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి.