బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో హీరోలు వర్సెస్ విలన్స్ అనే టాస్క్‌లో ముందుగా విలన్స్‌కు ఛాన్స్ రాగా వాళ్లు హీరోల టీమ్ నుంచి శ్రీరామ్‌ను సెలక్ట్ చేశారు. అతడికి పెయింట్ నెత్తిన పూసుకోవడం, విచిత్ర జ్యూస్‌లు తాగడం వంటి టాస్క్లిచ్చారు. వీటన్నింటిని పూర్తి చేయడంతో వారికి ఒక పాయింట్ వచ్చింది. తర్వాతి రౌండ్లో హీరోలు.. విలన్స్ టీమ్‌లోని రవిని టార్గెట్ చేశారు. రవి తన బట్టలన్నింటికీ పేడ అంటించాలని చెప్పాడు షణ్ను.
కానీ కొద్ది సేపటికి ధరించిన బట్టలకు మాత్రమే పేడ అంటిస్తే సరిపోతుందన్నారు. తర్వాత అన్ని మిక్స్ చేసిన జ్యూస్‌ను తాగాలని చెప్పారు. ఆ వెంటనే స్క్వాడ్స్ చేయాలన్నారు. తన వెన్నునొప్పిని సైతం పక్కనపెట్టి వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాడు రవి. అయితే అతడికి బ్యాక్ ప్రాబ్లమ్ ఉందని తెలిసినా కూడా అలాంటి కష్టమైన టాస్కులు ఎలా ఇస్తారని ఫైర్ అయింది అనీ.
అనీ వార్నింగ్ కూడా లెక్క చేయని విలన్స్ రవిని నానా తిప్పలు పెట్టారు. అతడిని గుండ్రంగా తిరగమని చెపారు. ఆ వెంటనే అతనితోమరో జ్యూస్ తాగించారు. మరో డ్రింక్‌ను తాగమని పురమాయించగా అతడు బాగోలేదంటూనే కళ్లు మూసుకుని తాగాడు. తన టీమ్‌ను గెలిపించడం కోసం సాయశక్తులా పోరాడి అందరి మన్ననలు పొందాడు. ఏదేమైన ఈ టాస్క్‌లు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి. కాని వాటిని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేస్తుండడం విశేషం.