ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జంట షణ్ముఖ్-సిరి. వీళ్లు చేసే రచ్చ ఎవరికి అర్ధం కావడం లేదు. అప్పుడే ఫ్రెండ్స్ అంటారు, అంతలోనే గొడవ పడతారు. మళ్లీ ఒకే దుప్పట్లోకి దూరి హగ్గులు, ముద్దులతో నానా రచ్చ చేస్తుంటారు. బుధవారం రోజు సిరి.. మానస్‌కు సేవలు చేయడం పట్ల షణ్ముఖ్ ఊగిపోయాడు. నామినేషన్స్ రోజు.. కార్నర్ చేసింది వాళ్లు.. గేమ్‌లో కార్నర్ చేసింది వాళ్లు.. ఇప్పుడు దెబ్బ తగిలిందని వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నావ్.
నువ్ నా ఫ్రెండ్‌గా ఉన్నందుకు సిగ్గుగా ఉంది.. నాకు లేదా నొప్పి.. నేను ఐస్‌లోనే ఉన్నాను.. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి మనిషికి.. నాకు ఇంత వీక్ ఫ్రెండ్ ఉందని సిగ్గు వేస్తుంది.. నువ్ నా ఫ్రెండ్‌గా ఉండొద్దు ఛీ.. ’ అంటూ రెచ్చిపోయాడు షణ్ముఖ్ . కాసేపటికే ఇద్దరూ కలిసి ఒకే దుప్పటిలోకి దూరారు. ఒకర్నొకరు ఓదార్చుకుంటూ కనిపించారు. హగ్గులు వద్దన్నా కూడా వీరిద్దరు వినేలా కనిపించడం లేదు.
షణ్ముఖ్.. హౌస్‌లో వేరే వాళ్లతో సిరి ఏ మాత్రం క్లోజ్ అయినా తట్టుకోలేకపోతున్నాడు. సన్నీ జోక్ వేశాడని నవ్వినందుకు పెంట పెంట చేశాడు.. చివరికి సన్నీని అన్నయ్య అని పిలవమన్నాడు.. అయితే అది బెడిసి కొట్టి.. సిరి తల్లి వచ్చి షణ్ముఖ్‌నే అన్నయ్య అని పిలిపించేలా చేసింది. మానస్ సాయం చేసినందుకు ఆమెపై చిర్రుబుర్రులాడాడు. హగ్ ఇవ్వడంతో మళ్లీ మాములు మనిషి అయ్యాడు. వీరి యవ్వారం ఏంటో ఎవరికి అర్ధం కావడం లేదు.