బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం మరో మూడు రోజులలో ముగియనుంది. దీంతో గేమ్ రసవత్తరంగా సాగుతుంది. గత మూడు రోజుల నుండి ఇంటి సభ్యుల సందడితోనే షో సాగుతుంది. శుక్రవారం రోజు ముందుగా సన్నీ తల్లి కళావతి ఇంట్లో అడుగుపెట్టింది. చాలా యాక్టివగ్గా కనిపించింది. బిగ్‌బాస్ నీకు చెల్లెలిని ఇచ్చిందంటూ కాజల్ వంక చూడటంతో ఆమె సంతోషంతో గెంతులు వేసింది. ఇంటికి వచ్చిన అమ్మకు గోరుముద్దలు తినిపించాడు సన్నీ.
తల్లి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్న బాక్స్‌ను కొడుక్కు అందించడంతో సన్నీ ఫుల్ ఖుషీ అయ్యాడు. తర్వాత తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేయగా నీకు నా గెలుపును బహుమతిగా ఇస్తానని కళావతికి మాటిచ్చాడు. గార్డెన్ ఏరియాలో కళావతి బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. కేక్ కట్ అందరికి తినిపించారు కళావతి. అయితే మానస్.. ప్రియాంకపై ఆగ్రహం వ్యక్తం చేయడం, షణ్ముఖ్.. సిరిపై కోప్పడడం జరిగింది.
‘పింకీ తనను వదిలి వెళ్లిపోయిన బాయ్‌ఫ్రెండ్ ప్లేస్‌లో నన్ను రీప్లేస్ చేద్దామని చూస్తోంది. అయితే అది కుదరదని, నేను అలాంటివాడిని కాదని చెప్పాను. మనం ఫ్రెండ్స్ మాత్రమే అని స్పష్టం చేశాను’ అని కాజల్‌తో చెప్పుకొచ్చాడు మానస్. ఇక సిరి తల్లి మాటలకు బాగా హర్ట్ అయ్యాడు షణ్ముఖ్. తండ్రి లేని కూతురని నీకు దగ్గరై అడ్వాంటేజ్ తీసుకోలేదని ఈ మాట మీ అమ్మకు చెప్పని సిరికి సూచించాడు.