Shankar | కొందరు దర్శకులు సినిమా పరిశ్రమలో తమ టాలెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో శంకర్ ఒకరు. “జెంటిల్మన్” నుంచి “రోబో” వరకూ అత్యుత్తమ చిత్రాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. కాని ఈ మధ్య శంకర్ పరిస్థితి దారుణంగా మారింది. ఆయన తీసిన సినిమాలు డిజాస్టర్స్‌గా మారుతున్నాయి. ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్ వంటి భారీ పాన్ఇండియా సినిమాలు రూపొందించిన శంకర్… రెండింటితోనూ తీవ్రంగా నిరాశపరిచారు. స్క్రిప్ట్ సెలెక్షన్ , స్క్రీన్ ప్లే అన్నింటిలో విఫలం కావడంతో ఆ సినిమాలు కనీస అంచనాలను కూడా అందుకోలేకపోయాయి. ఫలితంగా శంకర్ బ్రాండ్ మీదే నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
అయితే ఇప్పుడు శంకర్ తదుపరి చిత్రం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్ సందర్భంగా శంకర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’ నవల ఆధారంగా రూపొందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా వార్తల ప్రకారం, శంకర్ ఈ ప్రాజెక్ట్‌ను అజిత్‌తో చేయాలనుకుంటున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు కన్నడ హీరో యష్‌తో చేస్తాడని ఓ ప్రచారం నడుస్తుంది. మరి వీటిలో ఏది నిజం అవుతుందో చూడాల్సి ఉంది. అయితే టెక్నికల్ గా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించే శంకర్ నుంచి వచ్చిన ఎన్నో వండర్స్ లో ‘రోబో’ చిత్రం కూడా ఒకటి. అయితే లేటెస్ట్ గా శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తనకి ఒకప్పుడు రోబో సినిమా డ్రీం ప్రాజెక్ట్ అయితే ఇపుడు తనకి ‘వేళ్పారి’ సినిమా డ్రీం ప్రాజెక్ట్ అని కామెంట్స్ చేశారు.
ఈ సినిమా ప్రౌడ్ ఇండియన్ తమిళ్ సినిమాగా నిలుస్తుంది అని ఈ సినిమా ద్వారా అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో కొత్త టెక్నాలజీలని పరిచయం చేసే స్కోప్ ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే దీనిపై ఆల్రెడీ హాట్ డిస్కషన్స్ మొదలు కాగా, కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. శంకర్ మళ్ళీ డబ్బులు వేస్ట్ చేయబోతున్నారని, 24 గంటల ఫుటేజ్ తీయబోతున్నారని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ చిత్రంతో అయిన శంకర్ తన సత్తా చూపించనున్నారా లేదా అనేది చూడాలి.