టాలీవుడ్ (Tollywood) స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan), దర్శకదిగ్గజం (Shankar) డైరెక్షన్లో ఆర్సీ 15 (RC15) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani)హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి సర్కారోడు అనే టైటిల్‌ను శంకర్ టీం పరిశీలిస్తుందట. అయితే ప్రస్తుతానికి ఈ న్యూస్ వైరల్ అవుతున్నా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఆర్సీ 15 రాజమండ్రిలోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజోలు సుందరి అంజలి, కన్నడ యాక్టర్ జయరామ్, టాలీవుడ్ యాక్టర్ నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
రాంచరణ్ కీలక పాత్రలో నటించిన ఆచార్య ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు ట్రిపుల్ ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.