ఒకప్పుడు బొద్దుగా ఉన్న అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు సర్ప్రైజింగ్ లుక్‌లో కనిపించి షాక్ ఇస్తున్నారు.కీర్తి సురేష్,రాశీ ఖన్నా వంటి భామలు ఈ మధ్య చాలా తగ్గారు. ఇప్పుడు వారి జాబితాలో చేరింది అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాలో కథానాయికగా నటించిన షాలిని మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అయితే షాలిని నటించిన తొలి చిత్రం మంచి హిట్టైన పెద్దగా ఆఫర్స్ రాలేదు.
ఆఫర్స్ కోసం బాగా ప్రయత్నిస్తున్న షాలిని ఈ మధ్య హిందీ సినిమా ‘జయేష్ భాయ్ జోర్దార్’ కోసం సన్నబడ్డారు షాలిని. చిత్రంలో ఆమె పాత్ర డ్యాన్సర్ కాగా, ఆ పాత్రకోసం సన్నబడ్డట్టు చెప్పుకొచ్చింది. కథ డిమాండ్ చేస్తే పెరగడానికి అయిన, తగ్గడానికి అయిన రెడీ అంటుంది.
చక్కనమ్మ చిక్కినా చక్కనే అన్నట్లుగా షాలినీ ఉండగా, ఈ అమ్మడు స్లిమ్ లుక్‌లో తెగ ఫొటో షూట్స్ చేస్తుంది. తాజాగా నడుము అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ నెటిజన్స్‌కి కంటిపై కునుకు లేకుండా చేసే ప్రయత్నం చేసింది షాలిని. కాగా,ఆగస్ట్ 25 నాటికి అర్జున్ రెడ్డి విడుదలై నాలుగేళ్లు కాగా, అర్జున్ రెడ్డికి తాను ఎప్పటికీ రుణ పడి ఉంటానని తెలిపిందీ బ్యూటీ. తనకు అర్జున్ రెడ్డి సినిమా ఒక మ్యాప్‌లా పనిచేస్తుందని తెలిపిన ఈ బ్యూటీ.. ఈ సినిమాలో తాను తన స్థాయికి మించి ఉత్తమ నటన కనబరిచే ప్రయత్నం చేశానంది.