టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటిస్తున్న చిత్రం శాకుంతలం (Shakuntalam ). గుణ శేఖర్ (Gunasekhar) పాన్ ఇండియా నేపథ్యంలో పీరియాడికల్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని గుణశేఖర్ టీం ప్రకటించింది. అయితే కొన్ని వారాలుగా ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్స్ ఏం లేవు. దీంతో ఏదైనా అప్ డేట్ ఇవ్వాలంటూ అభిమానుల నుంచి విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నీలిమ గుణ సినిమా అప్డేట్ను ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు , సీజీ వర్క్ పనులు కొనసాగుతున్నాయని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కీ రోల్ చేస్తున్నాడు. అనన్య నాగళ్ల, అల్లు అర్హ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గుణటీమ్ వర్క్స్ బ్యానర్‌పై మైథలాజికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషలలో నిర్మితమవుతుంది.
పౌరాణికం నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించబోతున్నాడు గుణశేఖర్. సమంత టైటిల్ రోల్ చేస్తుండగా..దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నాడు.
#Shaakuntalam ✨🦢 pic.twitter.com/bJEPgDTdMd
— Neelima Guna (@neelima_guna) August 2, 2022