Shakuntalam first look | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power star Pawan kalyan )తో జోడీగా అత్తారింటికి దారేది చిత్రంలో నటించి సూపర్ హిట్ అందుకుంది సమంత ( Samantha ). ఆ తర్వాత వీళ్లు కలిసి నటించే అవకాశం రాలేదు. ఎవరి కెరీర్లో వాళ్లు సినిమాలు చేసుకుంటున్నారు. ఇకపై పవన్, సమంత కలిసి నటించే వీలు లేకపోవచ్చు గానీ..వాళ్లిద్దరూ ఒకే రోజున తమ కొత్త సినిమా అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ( Bheemla nayak ) ట్రైలర్ రిలీజ్ రోజునే సమంత కొత్త సినిమా శాకుంతలం నుంచి ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
భీమ్లానాయక్.. మేనియా ఇండస్ట్రీని ఆవహించేస్తోంది. విడుదలకు సిద్ధమైన ఇతర సినిమాలు కూడా ఆ సినిమాతో పోటీ ఎందుకు అని ఆగిపోతున్నాయి. ప్రీ రిలీజ్ వేడుక జరిగే సోమవారం రోజు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. సోమవారం ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే టైమ్ ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. ఏమైనా ట్రైలర్ రిలీజ్ టైమ్ కోసం అభిమానులు వేచిచూస్తున్నారు. ఇదిలా ఉంటే శాకుంతలం సినిమా నుంచి సమంత ఫస్ట్‌లుక్‌ను కూడా భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్ రోజునే విడుదల చేస్తున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు శాకుంతలం సినిమా నుంచి శకుంతలగా సమంత ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయబోతున్నారు. శకుంతల, దుష్యంతుని ప్రేమగాథ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. ఈ సినిమాల సమంత శకుంతలగా నటిస్తుండగా.. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు.
“Samantha | సమంత సినిమాకు భారీ సెట్..ఖర్చు తెలిస్తే షాకే..!”
Samantha Habibo dance | సమంత ‘హబిబో’ డ్యాన్స్ అదిరిందంతే..వీడియో వైరల్”
Bheemla Nayak | ‘భీమ్లా నాయక్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా కేటీఆర్”
“Bheemla Nayak | భీమ్లా నాయకా మజాకా..నాన్ థియాట్రికల్ రైట్స్ ఎంత పలికాయంటే..?”
భీమ్లా నాయక్‌తో పోటీ లేనట్టే.. శర్వానంద్ సినిమా వాయిదా”