Bheemla Nayak | జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలవుతోంది. హిందీలో సైతం ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరోవైపు ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లోని పోలీసు గ్రౌండ్స్‌లో అట్టహాసంగా నిర్వహించనున్నారు.
ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ వార్తతో ఇటు పవన్ అభిమానులు, అటు టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఈ చిత్రంలో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్లుగా నిత్యామీనన్, సంయుక్తా మీనన్ లు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు. తమన్ సంగీతాన్ని అందించగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.