Samantha | సమంత సినిమాకు భారీ సెట్..ఖర్చు తెలిస్తే షాకే..!
హరి-హరీష్ (Hari – Harish) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యశోద (Yashoda )క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ (tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం యశోద (Yashoda ) . హరి-హరీష్ (Hari – Harish) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో సామ్ టైటిల్ రోల్ చేస్తోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. యశోద సినిమా కోసం మేకర్స్ భారీ ఖర్చుతో సెట్స్ ను రెడీ చేశారట. తాజా టాక్ ప్రకారం సుమారు రూ.3 కోట్లతో భారీ సెట్ వేశారట.
సినిమా కథలో భాగంగా వచ్చే సెవెన్ స్టార్ హోటల్ సెట్‌ను ఆర్ట్ డైరెక్టర్ అశోక్ నేతృత్వంలో డిజైన్ చేయగా..కళ్లకు కట్టినట్టుగా రియల్ లుక్‌లో కనిపించనుందని ఇన్ సైడ్ టాక్. మల్టీ లింగ్యువల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీని సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సమంత హాలీడే స్పాట్ నిమిత్తం కేరళలో షికారు చేస్తోంది. కేరళలోని అందమైన ప్రాంతాల్లో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సరదా సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది.
సమంత మరోవైపుగుణ శేఖర్ డైరెక్షన్ లో నటించిన శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతోపాటు తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కాతువాకుళ రెండు కాధల్ చిత్రంలో నటిస్తోంది. విజయ్ సేతుపతి, నయన తార కీలక పాత్రలల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

