రెజీనా, నివేథా థామస్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా ప్రారంభమైంది. సౌత్ కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ మార్చిలో పూర్తి కాగా.. తాజాగా తుది షెడ్యూల్ షూట్ ఇవాళ తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్లోని ఫొటోను చిత్రం బృందం పంచుకుంది. ఈ ఫొటోలో రెజీనా, నివేదా థామస్, దర్శకుడు సుధీర్ వర్మ, కెమెరామ్యాన్ రిచర్డ్ ప్రసాద్ నవ్వుతూ కనిపించారు. ఈ సినిమాకు శాకినీ ఢాకినీ టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ రీమేక్‌కు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మేల్ వర్షన్లో ఉన్న ఒరిజినల్ సినిమాను ఫీమేల్ వర్షన్‌లోకి మార్చి సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, సునీతా తాతి, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Suresh Productions, Guru Films and Kross Pictures – the winning combination of Oh! Baby, are back in collaboration for the official remake of Midnight Runners. The film is being helmed by Sudheer Varma, starring Regina Cassandra and Nivetha Thomas. Shoot in progress ! pic.twitter.com/9SgOBBoITw
— Suresh Productions (@SureshProdns) July 26, 2021