Shakeela About Indrajit | ఎవరినీ గుడ్డిగా నమ్మడం ఇష్టం లేదు..దానికి పశ్చాత్తాప పడ్డా: షకీలా
కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఒకానొక టైంలో ఇండస్ట్రీలో లీడింగ్ పొజిషన్‌కు చేరుకుంది. సీనియర్ నటి షకీలా (Shakeela). షకీలా తాను ఎవరిని అంత సులభంగా నమ్మదలచుకోలేదని అంటోంది.

తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో రెండు దశాబ్దాలకుపైగా సినీ లవర్స్ ను అలరించింది సీనియర్ నటి షకీలా (Shakeela). కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఒకానొక టైంలో ఇండస్ట్రీలో లీడింగ్ పొజిషన్‌కు చేరుకుంది. షకీలా జీవిత చరిత్ర ఆధారంగా షకీలా (Shakeela) పేరుతో సినిమా కూడా రాగా..బాక్సాపీస్ వద్ద ఆశించినంత టాక్ తెచ్చుకోలేకపోయింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పుకొస్తూ.. తాను ఎవరిని అంత సులభంగా నమ్మదలచుకోలేదని తెలిపింది.
ఓ చిట్‌చాట్‌లో షకీలా మాట్లాడిన మాటలు ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. తన దగ్గరకు వచ్చిన చాలా మందిలో బంధువులు కానీ, సినిమా డైరెక్టర్స్ కానీ నమ్మదగిన వ్యక్తులు కాదని బాంబు పేల్చింది. బంధువులు ఆర్థికంగా సాయం పొందిన తర్వాత తనను మోసం చేశారని చెప్పింది. షకీలా బయోపిక్ తీసిన డైరెక్టర్ ఇంద్రజిత్ లంకేశ్ (Indrajit Lankesh)ను గుడ్డిగా నమ్మినందుకు పశ్చాత్తాపపడుతున్నట్టు చెప్పుకొచ్చింది.
షకీలా సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టే ముందు దర్శకుడు ఇంద్రజిత్ నాతో చర్చించారు.. కానీ అతని ఇష్టానుసారం కథను మార్చారు.. నేను సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నా కానీ అది బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది..అని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రస్తుతం కన్నడ చిత్రం దవ్వు మాస్టర్ చిత్రీకరణ కోసం బెంగళూరులో ఉన్నట్టు చెప్పుకొచ్చింది షకీలా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

