సడెన్ గా షూటింగ్ ఆపేసిన షారుక్‌ఖాన్..ఎందుకో తెలుసా..?
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్‌ఖాన్, షారుక్ ఖాన్ తమ సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ పఠాన్ సినిమా చేస్తుండగా..సల్మాన్ ఖాన్ టైగర్ 3లో నటిస్తున్నాడు.

బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్‌ఖాన్, షారుక్ ఖాన్ తమ సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ పఠాన్ సినిమా చేస్తుండగా..సల్మాన్ ఖాన్ టైగర్ 3లో నటిస్తున్నాడు. జీరో చిత్రం తర్వాత షారుక్ సుదీర్ఘ విరామం తీసుకుని పఠాన్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక సల్మాన్ ఖాన్ నటించిన రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ బాక్సాపీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. జీరోలో సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించి సందడి చేశాడు.
పఠాన్, టైగర్ 3 చిత్రాలు ముంబైలోని యశ్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో షూటింగ్ జరుపుకోనున్నాయి. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇపుడు టైగర్ 3తో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం టైగర్ 3 జులై 23 నుంచి చిత్రీకరణ మొదలుపెట్టనుంది. టైగర్ 3 మొదలు కానుండటంతో పఠాన్ షూటింగ్ ను అర్థాంతరంగా నిలిపేశాడట షారుక్. టైగర్ 3లో షారుక్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ లో కనిపించడమే దీనికి కారణం. టైగర్ 3 గెస్ట్ రోల్ కోసం షారుక్ ప్రిపరేషన్ లో ఉన్నాడట.
అంతేకాదు వచ్చే వారమే సల్మాన్ అండ్ టీంతో షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడట. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తోన్న ఈ ప్రాజెక్టు కోసం డైరెక్టర్ మనీశ్ శర్మ స్పెషల్ సెట్టు వేశాడు. ఇమ్రాన్ హష్మీ వచ్చే వారం షెడ్యూల్ లో జాయిన్ కానున్నట్టు బీటౌన్ టాక్. మొత్తానికి స్నేహితుడు సల్మాన్ కోసం తన సినిమాను సడెన్ గా ఆపేశాడు షారుక్. చాలా రోజుల తర్వాత షారుక్, సల్మాన్ టైగర్ 3లో కలిసి మెరువనుండటంతో సినీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

