Jawan Movie | మరో నాలుగు వారాల్లో రిలీజ్ కాబోతున్న జవాన్ సినిమా గురించి మేకర్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్ క్యాంపెయిన్ మొదలు పెట్టేశారు. ప్రమోషన్లో భాగంగా రిలీజైన టీజర్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. షారుఖ్‌ను ఒకేసారి అన్ని గెటప్స్‌లో చూసి హిందీ ప్రేక్షకులు అబ్బురపడి పోయారు. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పైగ పఠాన్ వంటి అరి వీర భయంకర హిట్ తర్వాత ఈ సినిమా వస్తుండంటంతో అందరిలోనూ అమితాసక్తి ఏర్పడింది. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో షారుఖ్ సైతం సినిమా ప్రమోషన్లో భాగంగా వీలైనప్పుడల్లా తన ఫాలోవర్స్‌తో చిట్ చాట్ నిర్వహిస్తూ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు.
కాగా తాజాగా జరిగిన చిట్ చాట్‌లో ఓ అభిమాని షారుఖ్‌ను విచిత్రమైన ప్రశ్న అడిగాడు. ‘నయనతార మేడమ్‌తో మీరు ప్రేమలో ఉన్నారా?’ అని ప్రశ్నించాడు. దీనికి ‘నోరుముయ్యి. ఆమె ఇద్దరు పిల్లల తల్లి’ హ హ అంటూ షారుఖ్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇక జవాన్ షూటింగ్ టైమ్‌లోనే నయనతార, విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ వేడుకకు షారుఖ్ కూడా వచ్చి దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపాడు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. దీపికా పదుకొనే గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనుంది. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీఖాన్ నిర్మిస్తుంది.
Chup karo! Doh bacchon ki maa hain woh!! Ha ha. #Jawan https://t.co/A9dujnaFCW
— Shah Rukh Khan (@iamsrk) August 10, 2023