KING Movie | క్రిస్మస్ కానుకగా షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. కొత్త పోస్టర్ విడుదల.!
Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'కింగ్' నుంచి మేకర్స్ తాజాగా ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
Shah Rukh | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’ నుంచి మేకర్స్ తాజాగా ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ మరోసారి రొమాంటిక్ లవర్ బాయ్ లుక్‌లో కనిపించి అభిమానులను అలరించనున్నారు. తన 60 ఏళ్ల వయసులోనూ లవర్ బాయ్‌గా నటిస్తున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా, సోషల్ మీడియా వేదికగా షారుఖ్ ఖాన్ ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ సినిమా థియేట్రికల్ విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.
“ఆజ్ ఫిర్ యాద్ ఆయా… కాతిల్ నహీ… ఆషిక్ హూ మే…” అంటూ షారుఖ్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో క్యాప్షన్ ఇస్తూ ఈ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. వీరితో పాటు దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Aaj phir yaad aaya…
Qaatil nahi… Aashiq hoon…
#KINGIn cinemas 24.12.26 https://t.co/Hbgz8ltR1I
— Shah Rukh Khan (@iamsrk) October 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KING Movie | క్రిస్మస్ కానుకగా షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. కొత్త పోస్టర్ విడుదల.!
Amritsar: గురుద్వారా వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ సర్పంచ్ సోదరుడి కాల్చివేత
Hyderabad | హైదరాబాద్‌లో మయన్మార్ మహిళపై అఘాయిత్యం.. స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్!
Ajith | అజిత్‌కు గుడి కడతామంటూ అభిమానుల ప్రకటన.. విగ్రహానికి క్షీరాభిషేకం
Health tips | నోటి పుండ్లు మిమ్మల్ని వేధిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

