Shah Rukh Khan | తమ అభిమాన నటులు కనిపిస్తే చాలు ఫ్యాన్స్ తెగ సందడి చేస్తుంటారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు అంటూ వెంట పడుతుంటారు. కొందరైతే ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. వారిని హగ్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. తాజాగా ఓ యువతి కూడా అలానే చేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడిని అందరి ముందూ ముద్దు పెట్టుకుంది. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే..? బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan).
షారుక్ ఇటీవల ఓ కార్యక్రమం కోసం దాబాయ్ (Dubai) వెళ్లాడు. అక్కడికి వచ్చిన కొందరు ఫ్యాన్స్ తో ఈ బాద్ షా సరదాగా కాసేపు ముచ్చటించాడు. వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగాడు. అయితే, అక్కడున్న ఓ యువతి మాత్రం షారుక్ ను చూసి అత్యుత్సాహం ప్రదర్శించింది. అందరి ముందూ షారుక్ బుగ్గపై ముద్దు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు (netizens) సదరు యువతిపై ఫైర్ అవుతున్నారు. ఆ యువతిని జైల్లో వేయాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Shah Rukh Khan kissed (forcefully?) by female fan
by u/humanbeing3333 in BollyBlindsNGossip
Also Read..
Upasana Konidela | పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం..!
Crocodile | బాలుడిని మింగేసిన మొసలిని కొట్టి చంపిన స్థానికులు