Shah Rukh Khan | వార్ 2 వంటి డిజాస్టార్ తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘ఆల్ఫా’ (Alpha). ఈ చిత్రంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. శార్వరీ వాఘ్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో మొదటి ఫిమేల్ స్పై చిత్రంగా రాబోతుండగా.. ఈ సినిమాను శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వార్ 2 ఎఫెక్ట్ తర్వాత స్పై యూనివర్స్‌కి కొంచెం డ్యామేజ్ జరుగగా.. ఈ డ్యామేజ్‌ని తొలగించడానికి చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా షారుఖ్‌ని సంప్రదించినట్లు తెలుస్తుంది. షారుఖ్‌ని తన పఠాన్ పాత్రలో అతిథిగా ‘ఆల్ఫా’ లో కనిపించమని కోరినట్లు సమాచారం. అయితే దీనికి షారుఖ్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. కాగా త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది. అనిల్ కపూర్, బాబీ దేవోల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.