టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం శాకుంతలం (Shaakuntalam). గుణ శేఖర్ (Guna Sekhar) దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.
కాగా గుణశేఖర్ టీం న్యూ ఇయర్ సందర్భంగా మూవీ లవర్స్ లో ఉన్న డైలామాకు చెక్ పెట్టబోతున్నట్టు ఓ అప్డేట్ అందించింది. ఈ కొత్త సంవత్సరాన్ని ఓ కొత్త ఎక్జయిటింగ్ అనౌన్స్ మెంట్తో మొదలుపెట్టబోతున్నాం. రేపు ఉదయం 11 గంటలకు ప్రకటన ఉండబోతుందని గుణ టీమ్ వర్క్స్ ట్వీట్ చేసింది. దీంతో రిలీజ్ డేట్ పై రేపు క్లారిటీ రాబోతుందంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు. మరి అదేంటనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్తో గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
శాకుంతలం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది.
ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. సమంత మరోవైపు విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ ప్రాజెక్టు ఖుషీ సినిమా కూడా చేస్తుండగా..కొత్త షూటింగ్ అప్డేట్ రావాల్సి ఉంది.
గుణ టీమ్ వర్క్స్ శాకుంతలం అప్డేట్..
Starting this new year with an exciting announcement 🤍#Shaakuntalam update tomorrow at 11 AM ✨@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #EpicLoveStory #MythologyforMilennials pic.twitter.com/3DqwsC11rl
— Gunaa Teamworks (@GunaaTeamworks) January 1, 2023