అనేకమైన అంతరాల్ని ఛేదిస్త్తూ ఓ ప్రేమజంట పయనం విజయ తీరాలకు ఎలా చేరిందన్నదే తమ చిత్ర ఇతివృత్తమని అంటున్నారు సీనియర్ దర్శకుడు కె .రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందడి’. రోషన్, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. గౌరి రోణంకి దర్శకురాలు. మాధవి కోవెలమూడి, శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. దసరాకు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘కుటుంబ విలువల సమ్మిళితంగా సాగే ప్రేమకథా చిత్రమిది. ఓ జంట ప్రణయబంధం ఎలా పరిణయంగా మారిందనేది హృద్యంగా ఉంటుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్‌కు హీరోగా చక్కటి శుభారంభాన్ని అందిస్తుంది. రాఘవేంద్రరావు పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సెన్సార్ పూర్తయింది. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ లభించింది’ అని తెలిపారు. ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, రావురమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రఫీ: సునీల్‌కుమార్ నామ.