టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం.రామకృష్ణా రెడ్డి మృతి చెందాడు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన తన స్వగ్రృహంలో తుదిశ్వాస విడిచాడు.
ఈయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయన ప్రముఖ దిగ్గజ నిర్మాత ఎంఎస్ రెడ్డికి బంధువు. నెల్లూరు జిల్లాలోని గూడురులో జన్మించిన రామకృష్ణా.. మొదట సిమెంటు రేకుల వ్యాపారాన్ని చేశాడు.
అనంతరం ఎంఎస్ రెడ్డి ప్రోత్సాహంతో సినీరంగంలోకి అడుగు పెట్టి ఎన్నో విజయవంత మైన చిత్రాలను నిర్మించాడు. కృష్ణంరాజు, అంజలీదేవి, శారద ప్రధాన పాత్రల్లో నటించిన ‘అభిమావంతులు’ సినిమాతో నిర్మాతగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ‘వైకుంఠపాళి’, ‘సీతాపతి సంసారం’, ‘అల్లుడుగారు జిందాబాద్’, ‘మా ఊరి దేవత’, ‘మూడిళ్ళముచ్చట’, ‘మాయగాడు’, ‘అగ్నికెరటాలు’, ‘గడుసు పిల్లోడు’ వంటి ఎన్నో హిట్టు సినిమాలను నిర్మించాడు.