Suhasini| ఒకప్పుడు తన అందంతో ప్రేక్షకులకి కట్టిపడేసింది సుహాసిని మణిరత్నం. విశ్వ నటుడు కమల్ హాసన్ అన్న కూతురిగా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన ఈమె తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. 1980,90లలో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటిస్తుంది. అయితే ఇప్పటికీ చెక్కు చెదరని అందం, అభినయంతో ప్రేక్షకులని అలరిస్తుంది సుహాసిని.1988లో ప్రముఖ డైరెక్టర్ మణిరత్నంను సుహాసిని పెళ్లి చేసుకుంది. అయితే హీరోయిన్ గా ఆమె కెరీర్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే వీరి పెళ్లి అయ్యింది.
అయితే సుహాసిని చెల్లి కూడా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అనే విషయం అందరికి తెలియకపోవచ్చు. మరి ఆ చెల్లి మరెవరో కాదు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్. సుహాసిని, శృతి హాసన్‌లు వరుసకి అక్కా చెల్లెళ్లు అవుతారు. అది ఎలా అంటే.. సుహాసిని తండ్రి, కమల్ హాసన్ సొంత అన్నా తమ్ముళ్లు. దాంతో శ్రుతి , సుహాసిని అక్కాచెల్లెళ్లు అవుతారు. వీరిద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంటుంది. శృతి హాసన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఈ భామ సలార్ 2తో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది.
శృతి హాసన్ వెనక కొండంత అండగా తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. హీరోయిన్గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్లా మారింది.వీరసింహా రెడ్డిలో బాలయ్యతో కలిసి నటించగా ఆ సినిమా హిట్ అయింది. వాల్తేరు వీరయ్య లో చిరంజీవి సరసన నటించింది. ఇది పెద్ద హిట్ అయింది. సలార్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని గోల్డెన్ లెగ్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిపోయింది శృతి హాసన్. సింగర్‌గా కూడా శృతి హాసన్‌కు మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోయిన్గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ ఎఫైర్స్ తో కాస్త గాడి తప్పింది. ఇప్పుడు మళ్లీ గాడిలో పెట్టుకునేందుకు ట్రై చేస్తుంది.