నటుడిగా రాఘవేంద్రరావు.. ఆయన సరసన నటించనుందెవరంటే?

నూరు చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఇప్పుడు తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఇన్నాళ్లు ఆఫ్ స్క్రీన్లోనే ఉన్న రాఘవేంద్ర రావు ఇప్పుడు ఆన్స్క్రీన్లోను కనిపించి సందడి చేయనున్నాడట. రచయిత, నటుడు తనికెళ్ల భరణి .. రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారు.
తనికెళ్ల భరణి తెరకెక్కించనున్న ఈ చిత్రంలో రాఘవేంద్ర రావు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నారు. ఆయన భార్య పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ కనిపిస్తారని టాక్. అలానే అందాల ముద్దుగుమ్మ శ్రియ కూడా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. లాక్డౌన్ తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. కాగా, రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు హీరోగా పెళ్లి సందడి చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

