Aayirathil Oruvan Re Releasing | తమిళ నటుడు కార్తీ నటించిన క్లాసిక్ చిత్రాలలో ‘యుగానికి ఒక్కడు’(తమిళంలో ‘ఆయిరత్తిల్ ఒరువన్’) ఒకటి. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆర్. రవీంద్రన్ నిర్మించారు. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా జెరెమయ్యా ప్రధాన పాత్రల్లో నటించారు. హిస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం 2010లో విడుదలై తమిళంతో పాటు తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. అయితే ఇదే సినిమాను దాదాపు 15 ఏండ్ల సంవత్సరాల తర్వాత మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1279 AD, 14వ శతాబ్దం, మరియు 2010 మూడు వేర్వేరు కాలాల్లో జరిగే కథను చూపిస్తుంది. కథ ప్రధానంగా చోళ సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుంది. 1279లో చోళ రాజు తన రాజ్యాన్ని పాండ్యుల నుంచి కాపాడేందుకు తన కుమారుడిని తన ప్రజలను రహస్య స్థలానికి పంపిస్తాడు. అయితే కనిపించకుండా పోయిన చోళుల జాడని వెతకడానికి కార్తీతో పాటు శాస్త్రవేత్తలు పాండ్య వంశానికి చెందినవారు ఒక ప్రమాదకరమైన ప్రయాణం చేపడతారు. అయితే వీరు వెళ్లే క్రమంలో ఎదురైన ప్రమాదాలు ఏంటి. వీరందరూ చివరికి చోళుల జాడను కనిపెడతారా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
The 𝐂𝐇𝐎𝐋𝐀𝐒 Are Returning! ⚔️🔥
Bringing back the epic fantasy masterpiece #YuganikiOkkadu to reignite the silver screen once again after 15 long years❤️🔥#YuganikiOkkaduReRelease in theatres from MARCH 14th 💥
Releasing in AP & TG, Karnataka, and USA through… pic.twitter.com/M4t6C2Nt3d
— Primeshow Entertainment (@Primeshowtweets) February 22, 2025