సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమా నుంచి ‘తెల్లారు పొద్దుల్లో’ అంటూ సాగే పాటను శుక్రవారం కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం అందించారు.
ధనుంజయ్, అదితి భావరాజు ఆలపించారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు, పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, గోదావరి నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: మార్కండేయ, నిర్మాణ సంస్థ: పీఎల్వీ క్రియేషన్స్, దర్శకుడు: పి.ఎల్.విఘ్నేష్.