డాన్సులకు పేరొస్తుంది
స్టార్ హీరోల సినిమాలకు పాటలు కంపోజ్ చేస్తూ కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్. సంక్రాంతికి విడుదల కానున్న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. జనవరి 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
స్టార్ హీరోల సినిమాలకు పాటలు కంపోజ్ చేస్తూ కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్. సంక్రాంతికి విడుదల కానున్న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. జనవరి 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ..‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో అన్ని పాటలకు నేనే డ్యాన్సులు కంపోజ్ చేశాను. ‘వీరసింహారెడ్డి’లో జై బాలయ్య, సుగుణసుందరి, మా బావ మనోభావాలు పాటలకు కొరియోగ్రఫీ చేశాను. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికే విడుదలవుతాయని ముందు తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కో లిరికల్ సాంగ్స్ విడుదలవుతుంటే టెన్షన్ మొదలైంది.
ఈ రెండు చిత్రాల్లో డ్యాన్సులు ఆకర్షణ అవుతాయి. కొరియోగ్రఫీ విషయానికొస్తే పాటకు ఏం కావాలో ముందు ప్లాన్ చేసుకుంటాం. ఆ తర్వాత హీరో బాడీ లాంగ్వేజ్‌ను బట్టి మూమెంట్స్, స్టెప్స్ డిజైన్ చేస్తాను. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరిలో ఉన్న అంకితభావం చూసి నేర్చుకోవాలి. సమయపాలన, అనుకున్న స్టెప్ వచ్చేవరకు సాధన చేయడం చూసి ఆశ్చర్యమేస్తుంటుంది. అందుకే వాళ్లు ఇంతకాలం అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారని అనిపిస్తుంటుంది. చిరంజీవి గారి సినిమాలోని ‘నువ్వు శ్రీదేవి’ పాటను పూర్తి మంచులో చేస్తే..బాలకృష్ణ చిత్రంలోని ‘సుగుణసుందరి’ పాటను ఎండలో చిత్రీకరించాం. స్టార్ హీరోలు కాబట్టి వీరితో కలిసి పనిచేస్తున్నప్పుడు మా డ్యాన్సులపై అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

