Seetimaar | తగ్గేదే లే అంటున్న గోపీచంద్..థియేటర్స్ లోనే ‘సీటీమార్’
గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ (Seetimaarr) సినిమా విడుదల కూడా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. సంపత్ నంది (SampathNandi) తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొన్నటివరకు ఓటీటీలో విడుదలవుతుందని ప్రచారం జరిగింది. Seeti

కరోనా కాస్త తగ్గినట్లు అనిపించగానే దర్శక నిర్మాతలకు మళ్లీ ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. అందుకే వరుసగా సినిమాలు విడుదల చేయడానికి ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నారు. తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ (Seetimaarr) సినిమా విడుదల కూడా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. సంపత్ నంది (SampathNandi) తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొన్నటివరకు ఓటీటీలో విడుదలవుతుందని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదు తమ సినిమా ఖచ్చితంగా థియేటర్లలోనే అని పోస్టర్ విడుదల చేశారు. సెప్టెంబర్ లో కలుసుకుందాం అంటూ ముహూర్తం ఖరారు చేశారు. దానిపై మీసం తిప్పిన గోపీచంద్ ఫోటో కూడా వేశారు.
ఒకప్పుడు విలన్‌గా ఉండి..ఆ తర్వాత హీరోగా మారి వరస విజయాలు అందుకున్న హీరో గోపీచంద్ (Gopichand). లౌక్యం వరకు కూడా సూపర్ హిట్స్ అందుకుని స్టార్ హీరో అయిపోయాడు ఈయన. కానీ ఆ తర్వాత మాత్రం గోపీచంద్ తన స్థాయికి తగ్గ సినిమాలు చేయడం లేదు. జిల్ సినిమా కూడా అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన గౌతమ్ నందా కూడా అడ్రస్ లేకుండా పోయింది. 25వ సినిమా అంటూ వచ్చిన పంతం కూడా ఫ్లాప్ అయింది. దాంతో గోపీచంద్ కెరీర్ మరింత డౌన్ లోకి వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో ఈయన సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతుంది. మరోవైపు సంపత్ నంది కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. అయినా కూడా ఈయన్ని నమ్మి ఈ చిత్రం చేస్తున్నాడు గోపీచంద్. కబడ్డి నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ బాలరెడ్డిగా గోపీచంద్.. తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ జ్వాలా రెడ్డిగా మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah)నటిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు టైటిల్ సాంగ్, జ్వాలా రెడ్డి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు గోపీచంద్. గతంలో గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నందా ఫ్లాప్ అయింది. మొత్తానికి చూడాలిక..ఈ చిత్రంతో గోపీ ఏం మాయ చేస్తాడో..?
ఇవికూడా చదవండి..
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

