గతేడాది క్రాక్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు రవితేజ (Ravi Teja). కిక్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్టు కోసం ఎదురుచూస్తున్న రవితేజకు క్రాక్ (Krack) రూపంలో భారీ సూపర్ డూపర్ హిట్టు పడ్డది. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద రవితేజ మార్కెట్‌ను అమాంతం ఆకాశికెత్తేసింది. అప్పటివరకు అంతంత మాత్రమే వస్తున్న సినిమా అవకాశాలు కాస్త పెరిగి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రవితేజ తలుపు తట్టాయి. పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావు (Ravi Teja). సినిమా కోసం ఏకంగా రూ.7 కోట్లతో స్పెషల్ సెట్ (Rs 7 Cr set worth)వేశారని ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.
ఈ ఒక్కటి చాలు రవితేజ రేంజ్ ఎలా పెరిగిందో చెప్పడానికి. ఇదిలాఉంటే రవితేజ రెమ్యునరేషన్ రూ.17-19 కోట్లు తీసుకుంటున్నాడని లేటెస్ట్ టాక్. రవితేజ పారితోషికం (Ravi Teja Remuneration ). ఇంతలా పెరిగిపోవడం వెనుకున్న సీక్రెట్ ఏంటనే దానిపై ఓ చర్చ నడుస్తోంది. రవితేజ సినిమాకు హిట్ టాక్ వస్తే రూ.40-45 కోట్లు రాబట్టడం గ్యారంటీ అని ట్రేడ్ పండితుల అంచనా. క్రాక్ సినిమా ఈ విషయాన్ని నిరూపించింది. ఒకవేళ థియేటరల్లో ఫెయిల్ అయితే నాన్ థ్రియాట్రికల్ రైట్స్ తో ఆ లోటు భర్తీ అవుతుంది.
నాన్ థ్రియాట్రికల్ రైట్స్ విషయంలో హిందీ డబ్బింగ్ రైట్స్ తో కలిపి మాస్ మహారాజా సినిమా రూ.40 కోట్ల వరకు రాబడుతుందని టాక్. ఇలాంటి అంశాల వల్లే నిర్మాతలు రవితేజ సినిమాలపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సాహసం చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. రవితేజ రెమ్యునరేషన్ సినిమా సినిమాకు పెరిగిపోవడానికి కారణమిదేనట.