నాచురల్ స్టార్ నాని ‘దసరా’ మూవీ నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్, దసరా టీజర్ మాసెస్కు కిక్ ఇవ్వగా.. మరోసారి అంతకు మించిన ట్రీట్ ఇచ్చేందుకు మూవీ టీమ్ సిద్ధమైంది.
తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమోను కాసేపటి క్రితం మేకర్స్ వదిలారు. ‘ఓరి వారి నీదు గాదుర పోరి .. ఇడిసెయ్ రా ఇంగ .. ఒడిసెను దారి’ అంటూ ఈ పాట సాగుతోండగా.. కథానాయకుడు తన ప్రేమ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ పడే మనోవేదనను ఆవిష్కరిస్తుందని దర్శకుడు తెలిపారు. పూర్తి పాటను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది.
Ori vaari … Needhi kaadhu ra pori 🎶💔
It’s ok boys 🙂#Dasara #OriVaari pic.twitter.com/wyDu2HDH1T
— Nani (@NameisNani) February 11, 2023