Bigg Boss: సీజన్ 5 లాంచింగ్ ఎపిసోడ్‌కు దారుణమైన రేటింగ్..!

విదేశాలలో మొదలైన బిగ్ బాస్ షో మెల్లగా మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అన్ని ప్రాంతీయ భాషలకు పాకింది. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఐదో సీజన్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 5 న ప్రారంభమైన ఈ షోలో 19 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఇప్పటికే ఈ షో నుండి సరయు ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమా దేవి హౌజ్ నుండి బయటకు వస్తుందని సమాచారం.
బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా మారాడు. ఆ తర్వాత మూడు, నాలుగు సీజన్స్ తో పాటు ప్రస్తుతం నడుస్తున్న 5వ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్‌గా ఉన్నారు. అయితే తాజాగా సీజన్ 5 లాంచింగ్ ఎపిసోడ్ రేటింగ్ రాగా, ఇది యాజమాన్యాన్ని చాలా నిరాశపరిచేదిగా ఉంది. తొలి సీజన్ లాంచింగ్ ఎపిసోడ్ 16.18 రేటింగ్ రాగా, సీజన్ 2 లాంచింగ్ ఎపిసోడ్ 15.05, సీజన్ 3 ఎపిసోడ్ 17.9, సీజన్ 4 ఎపిసోడ్ 18.5 టీఆర్పీలు వచ్చాయి.
సీజన్ 5 లాంచింగ్ ఎపిసోడ్‌కి 15.71 రేటింగ్ రావడంతో అంతా షాక్ అయ్యారు. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఈ షోకి ఇంత తక్కువ రేటింగ్ రావడం ఆశ్చర్యపరిచింది. ఎపిసోడ్స్ పరిస్థితి కూడా అలానే ఉందనే టాక్స్ వినిపిస్తున్నాయి. ‘బిగ్ బాస్’ సీజన్ 5 ఎపిసోడ్స్ చేపల మార్కెట్ ని తలపించేవిగా ఉన్నాయి. బిగ్ బాస్ స్క్రిప్ట్ కి అనుగుణంగా నటిస్తున్న పోటీదారుల నటనలో జీవమే లేదని అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

