Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
Satyajit Ray Film Institute : ఆరుగురు విద్యార్థులపై విధించిన ఏడాది వేటును సమర్ధిస్తూ సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రకటన చేసింది. సత్యజిత్ రే క్యాంపస్‌లో జరిగిన విధ్వంసం నేపథ్యంలో ఆ చర్యలు తీసుకున్నట్లు వర్సిటీ చెప్పింది. నసీరుద్దీన్ షా వ్యాఖ్యల తర్వాత ఇన్స్టిట్యూట్ రియాక్ట్ అయ్యింది.
కోల్‌కతా: సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నది. ఆరుగురు విద్యార్థులపై విధించిన ఏడాది వేటును సమర్ధిస్తూ ప్రకటన చేసింది. సత్యజిత్ రే క్యాంపస్‌లో జరిగిన విధ్వంసం నేపథ్యంలో ఆ చర్యలు తీసుకున్నట్లు వర్సిటీ చెప్పింది. తాజాగా నటుడు నషీరుద్దీన్ షా ఆ విద్యార్థుల నిరసనకు మద్దతు ఇవ్వడంతో సత్యజిత్ రే ఇన్స్టిట్యూట్ మరోసారి స్పందించాల్సి వచ్చింది. విద్యార్తులు ప్రవర్తన సరిగా లేదని, విధ్వంసానికి పాల్పడ్డారని, భౌతిక దాడికి దిగడం వల్లే ఆ స్టూడెంట్స్‌ను ఏడాది పాటు నిషేధించినట్లు సత్యజిత్ రే ఇన్స్టిట్యూట్ పేర్కొన్నది.
బీజేపీ ప్రతీకారానికి ఎస్ఆర్ఎఫ్టీఐ విద్యార్థులు బలైనట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో నషీరుద్దీన్ షా ఆరోపించారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ మోసపూరిత రీతిలో నెగ్గినట్లు ఆయన ఆరోపించారు. షా వ్యాఖ్యల నేపథ్యంలో సత్యజిత్ రే ఇన్స్టిట్యూట్ మళ్లీ రియాక్ట్ అయ్యింది. విద్యార్థుల నిరసన శాంతియుతంగా జరగలేదని, వారి ప్రవర్తన విధ్వంసం, భౌతిక దాడి ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఎస్ఆర్ఎఫ్టీఐ పేర్కొన్నది. క్యాంపస్ విధ్వంసం నేపథ్యంలో అక్టోబర్ 12వ తేదీ నుంచి వీసీ సంతోష్ అజ్మేరా ఆఫీసు ముందు విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. అయితే అక్టోబర్ 16వ తేదీ ఎస్ఆర్ఎఫ్టీఐ ఆదేశాలు ఇస్తూ.. ఫిల్మ్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ఫ్యాకల్టీ ఆపరేషన్స్ అన్నీ నవంబర్ 13వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు చెప్పింది.
సత్యజిత్ రే ఇన్స్టిట్యూట్లో సెప్టెంబర్ 27వ తేదీన ఆర్ఎస్ఎస్కు చెందిన అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. వినియోగదారుల అవగాహన కార్యక్రమంలో ఘర్షణలు జరిగాయి. ఆ ఘటనలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. ఆ మరుసటి రోజు నుంచి అకాడమీ క్లాసులను రద్దు చేశారు. సెప్టెంబర్ 27వ తేదీన జరిగిన ఘటనను నిరసిస్తూ అక్టోబర్ 4వ తేదీన ఇన్స్టిట్యూట్ ముందు బంగియో హిందూ జాగరన్ మంచ్ ఆందోళన చేపట్టింది. ఆ నిరసన ప్రదర్శన వేళ రాళ్లు, ఇటుకలు, బాటిళ్లను క్యాంపస్‌లోకి విసిరినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఘటనపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది. అక్టోబర్ 12 నుంచి విద్యార్థులు నిరాహార దీక్షకు దిగడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అక్టోబర్ 16వ తేదీన వాష్‌రూమ్‌లు, ఎలక్ట్రిసిటీ, వర్క్‌ప్లేస్‌లను నియంత్రించారు. నవంబర్ 13 వరకు క్లాసులు బంద్ చేస్తూ.. 24 గంటల్లో విద్యార్థులు ఖాళీ చేయాలని ఆదేశించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

