Full Bottle Movie Teaser | సహాయ నటుడిగా కెరీర్ ప్రారంభించి.. జ్యోతిలక్ష్మి సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు సత్యదేవ్. ఆయన సినిమాలు భారీ రేంజ్లో హిట్లు కాకపోయినా.. ఉన్నంతలో కాస్త బెటర్‌గానే పర్ఫార్మ్ చేస్తుంటాయి. కెరీర్ బిగెనింగ్ నుంచి సత్యదేవ్ కథా బలమున్న సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. హీరోగానే కాకుండా మధ్య మధ్యలో కీలక పాత్రల్లోనూ మెరుస్తున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఫుల్ బాటిల్ ఒకటి. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై కాస్త మంచి ఇంపాక్టే క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
టీజర్‌తోనే సినిమాపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. పూర్తిగా మధ్యం కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ఇదని టీజర్‌తో స్పష్టమైంది. హీరోకు మందు పడనిదే బండి నడవదు అనేలా సత్యదేవ్ క్యారెక్టర్ ఉంది. అంతేకాకుండా హీరోకు ఓ వీక్ నెస్ కూడా ఉంటుంది. అదే సినిమాలో కీలకం కానున్నది టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. మెర్క్యూరి సూరి అనే పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు. సునీల్, బ్రహ్మాజీలకు కూడా మంచి క్యారెక్టర్లు పడ్డాయని తెలుస్తుంది. ఇక లవ్ ట్రాక్‌కు కూడా కాస్త ఎక్కువగానే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా టీజర్ అయితే ఆహా.. ఓహో అనే రేంజ్లో లేకపోయినా.. పర్వాలేదనిపిస్తుంది.
అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా సంజనా నటిస్తుంది. పూర్తిగా కాకినాడ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను శరవంత్ రామ్ క్రియేషన్స్, ఎస్డి కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇదే ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.