Rangabali | హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya). ఈ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం రంగబలి (Rangabali). ఈ చిత్రానికి డెబ్యూ దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రంగబలి టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా ఈ చిత్రంలో కమెడియన్ సత్య (Satya) వన్ ఆఫ్ ది కీ రోల్ చేస్తున్నాడు. రంగబలి చిత్రం జులై 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో నాగశౌర్య టీం ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. రీసెంట్గా నాగశౌర్యను సత్య ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో డిఫరెంట్ మీడియా పర్సనాలిటీస్‌ను ఇమిటేట్ చేశాడు నాగశౌర్య. పలు గెటప్స్‌లోకి మారిపోయి నాగశౌర్యను ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్ల మనసు దోచేస్తోంది. ఇటీవలే విడుదల చేసిన రంగబలి ట్రైలర్ (Rangabali trailer) సినిమా ఫన్ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేసింది. ప్రతీ మనిషి పేరు మీద సొంతిల్లుండకపోవచ్చు. సొంత పొలం ఉండకపోవచ్చు.. కానీ సొంతూరు మాత్రం ఉంటది.. అంటూ ఊరు ప్రాముఖ్యత గురించి చెబుతున్న డైలాగ్స్‌తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమా వినోదాత్మకంగా సాగనున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన మన ఊరిలో ఎవడ్రా ఆపేది, కల కంటూ ఉంటే పాటలకు మంచి స్పందన వస్తోంది. రంగబలి చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆర్ శరత్‌కుమార్, సప్తగిరి, గోపరాజు రమణ, కల్యాణి నటరాజన్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, సప్తిగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి, భద్రం, శివనారాయణ, పీకే, పవన్, నోయెల్, రమేశ్ రెడ్డి, హరీష్ చంద్ర, బ్రహ్మాస్త్రి, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగశౌర్య దీంతోపాటు నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
సత్య ఇమిటేషన్ సాగిందిలా..
రంగబలి ట్రైలర్..
కల కంటు ఉంటే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
కల కంటు ఉంటే సాంగ్ ప్రోమో..
రంగబలి టీజర్..
మన ఊరిలో లిరికల్ వీడియో సాంగ్..