‘పుష్ప’ ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు-చాప్టర్ 1’. వెన్నెల కిషోర్, అనీష్ దామా, బిత్తిరి సత్తి తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అభినవ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.
ఈ నెల 26న ఆహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘డార్క్ కామెడీతో పాటు హృదయాలను తాకే భావోద్వేగాలు మిళితమైన చిత్రం ఇది. గ్రిప్పింగ్ నెరేషన్‌తో సాగుతూ ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.