Singer Sunitha Son New Movie | యదార్థ సంఘటనల ఆధారంగా అని కనిపిస్తే చాలు సినీ లవర్స్‌లో ఎక్కడలేని ఆసక్తి క్రియేట్ అవుతుంది. అలాంటి కథలకు కాస్త క్రియేటివిటీ తోడైతే బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్చ చేయోచ్చు. ప్రస్తుతం అలాంటి కథతో వస్తున్న సినిమా సర్కార్ నౌకరి. సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకుడు. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ందుఇ. కాగా ఇప్పటికే రిలీజైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్‌లో 1996లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్లో చూపించారు. దానికి తగ్గట్లే టీజర్ మొత్తం అప్పటి సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్‌తో నిండి ఉంది. గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కనే ఓ అమ్మాయికి అలాంటి అబ్బాయే దొరుకుతాడు. కానీ ఏ జాబ్ అనేది ఎవ్వరికీ తెలియదు. సర్కార్ నౌకరంటే చాలు పైసల్ మస్తుగొస్తయి అనే ఆలోచించే విధంగా అప్పట్లో జనాలు ఉండేవారిగా టీజర్ చూపించారు. టీజర్ చివర్లో పల్లెటూరిలో కండోమ్స్ అందుబాటులో ఉంచే ఎంప్లాయిగా ఆకాష్‌ను చూపించాడు. అయితే దానివల్ల ఆయన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కున్నాడు? ఆకాష్ జాబ్ గురించి తెలిసిన హీరోయిన్ ఆయన్ని పెళ్లి చేసుకుంటుందా? ఒక వేళ పెళ్లి చేసుకుంటే వాళ్ల జీవితం ఎలా సాగింది? అనే కథనంతో సినిమా సాగనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది.
చిన్న సినిమాగా కనిపించినా.. కంటెంట్ మాత్రం కాస్త కొత్తగా ఉంది. అప్పట్లో నిరోధ్లపై ఏ మాత్రం అవగాహనలేని వారికి వీటి గురించి చెప్పనున్నట్లు.. దాన్ని తప్పులాగా చూడొద్దంటూ తెలియజేసే విధంగా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మధ్య చిన్న సినిమాలు రాజ్యమేలుతున్న విషయం విధితమే. ఇప్పుడు సర్కార్ నౌకరి సినిమా కూడా అదే స్థాయిలో మంచి సక్సెస్ సాధిస్తుందని చిత్రయూనిట్ ధీమాగా ఉంది.