Saripodhaa Sanivaaram | ‘హాయ్ నాన్న’ వంటి సూపర్ హిట్ తర్వాత స్టార్ హీరో నాని నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది.
గరం గరం యముడయో అంటూ సాగిన ఈ పాట ఫుల్ మాస్ బీట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఫుల్ సాంగ్‌ను జూన్ 15 శనివారం రోజున విడుదల చేయనున్నట్లు తెలిపారు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ‘అంటే సుందరానికి’ (Ante Sundharaniki) సినిమా తర్వాత నాని – వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
On the way 🙂#GaramGaram promo #SaripodhaaSanivaaram #SuryasSaturday pic.twitter.com/Pi9rsAqN2D
— Nani (@NameisNani) June 13, 2024