Saripodhaa Sanivaaram | స్టార్ హీరో నాని నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు.
గరం గరం యముడయో(Garam Garam Yamudayo) సహనాల శివుడాయో.. నరం నరం బిగువయో నియామాల తెగువయో అంటూ సాగిన ఈ పాట ఫుల్ మాస్‌గా ఉంది. ఇక ఈ పాటను విశాల్ దద్లానీ పాడగా.. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ‘అంటే సుందరానికి’ (Ante Sundharaniki) సినిమా తర్వాత నాని – వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.