Sarfira Movie | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సర్ఫీరా'(Sarfira Movie). ఈ సినిమాకు స్టార్ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహిస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, సుధా కొంగర కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఆకాశం నీ హద్దురా (Aaksham Nee haddura). 2020 నవంబర్ 12న నేరుగా ఓటీటీలోకి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇదే సినిమాను సుధా కొంగరా హిందీలో సర్ఫీరా గా రీమేక్ చేస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను జూలై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సోలోగా రాబోతుంది. మరోవైపు ఈ సినిమా టీజర్‌ను జూన్ 20న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
AKSHAY KUMAR: ‘SARFIRA’ FIRST POSTER UNVEILS… 12 JULY RELEASE… #Sarfira – which marks #AkshayKumar – director #SudhaKongara’s first collaboration – arrives in *cinemas* on 12 July 2024.#Sarfira also features #PareshRawal, #RadhikkaMadan and #SeemaBiswas.
Produced by Aruna… pic.twitter.com/8I6DVJY31v
— taran adarsh (@taran_adarsh) June 14, 2024