Sardar 2 | తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులోనూ స్టార్డమ్ సంపాదించుకున్న నటుడు కార్తీ. ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కార్తీ, ఆ తర్వాత ‘ఆవారా’, ‘నా పేరు శివ’, ‘ఖాకీ’, ‘ఖైదీ’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో సర్దార్ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకు తాజాగా సీక్వెల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నేడు కార్తీ పుట్టినరోజు కావడంతో తాజాగా ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను పంచుకుంది టీమ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్‌గా మారింది.
‘సర్దార్ 2’ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. పార్ట్ 1కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా పని చేయగా, సీక్వెల్‌కు యువన్ శంకర్ రాజాను తీసుకోవడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. అంతేకాకుండా, ఈ సీక్వెల్లో స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించబోతున్నారు. ‘సర్దార్ 2’ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
We at @Prince_Pictures wish the stellar actor and our dearest @Karthi_Offl sir a very happy birthday.#Sardar2@ivyofficial2023 @Psmithran @iam_SJSuryah @lakku76 @venkatavmedia @RajaS_official @B4UMotionPics @MalavikaM_ @AshikaRanganath @rajishavijayan @iYogiBabu @SamCSmusic… pic.twitter.com/AfT5nabrG7
— Prince Pictures (@Prince_Pictures) May 25, 2025