Ashika Ranganath |కార్తీ బ్లాక్బాస్టర్ ‘సర్దార్’ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చెన్నై శివార్లలో నిర్మించిన భారీసెట్స్‌లో మొదలైంది. ప్రీక్వెల్ దర్శకుడు పిఎస్ మిత్రన్ ‘సర్దార్ 2’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక మోహనన్ కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ని మేకర్స్ ప్రకటించారు.
‘సర్దార్ 2’లో అషికా రంగనాథ్ మరో ఫీమేల్ లీడ్‌గా కనిపించనుంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రాజెక్ట్‌లోకి స్వాగతం పలికారు. ఎస్.జె.సూర్య పవర్ఫుల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి.విలియమ్స్, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, నిర్మాత: ఎస్.లక్ష్మణ్‌కుమార్, నిర్మాణం: పిన్స్ పిక్చర్స్.