రాజారవీంద్ర ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి అలియాస్ పండు ఈ చిత్రానికి దర్శకుడు. ఉమాదేవి, శరత్చంద్ర నిర్మాతలు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హీరో నిఖిల్ ట్రైలర్‌ను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. కుటుంబ భావోద్వేగాలు, మధ్యతరగతి కష్టాల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగిందని ట్రైలర్ చెబుతున్నది.
‘కులం అంటే రక్తం కాదు.. పట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం’.. లాంటి ఆలోచించే డైలాగులు ఈ ట్రైలర్లో వినిపించాయి. ఇందులో రాజారవీంద్ర మధ్యతరగతి తండ్రిగా, ఉపాధ్యాయుడిగా కనిపిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ స్వయంభు, మాటలు: వినయ్ కొట్టి, సంగీతం: ఎబెనెజర్పాల్.