‘మీ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి టార్గెట్ పెట్టుకున్నారా అని అడిగితే…ఆ వసూళ్లన్నీ నిర్మాతకే వెళ్తాయి కదా అందులో మాకొచ్చేదేమిటి’ అని అంటున్నది బాలీవుడ్ తార సారా అలీఖాన్. సినిమా వసూళ్ల విషయంలో ఇప్పటిదాకా మరే నాయికా ఇలా భిన్నంగా స్పందించలేదు. పేరొచ్చే చిత్రాల్లో భాగమవ్వాలని మాత్రమే కోరుకుంటున్నట్లు సారా అలీఖాన్ తెలిపింది. ప్రస్తుతం ఆమె గ్యాస్ లైట్ అనే చిత్రంతో పాటు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కొత్త సినిమాలో నటిస్తున్నది. మీ డ్రీమ్ రోల్ ఏంటని అడగ్గా ఆమె మహారాణి లేదా మోడరన్ గర్ల్ పాత్రల్లో నటించాలని ఉందని తెలిపింది. సారా అలీఖాన్ మాట్లాడుతూ…‘దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన చిత్రాల్లో మహారాణి పాత్రలో నటించాలన్నది నా కోరిక. అలాగే జోయా అక్తర్ రూపొందించే చిత్రాల్లో మోడరన్ గర్ల్ క్యారెక్టర్ చేయాలనుంది. సినిమా ఏదైనా ప్రేమతో, అంకితభావంతో పనిచేయాలని అనుకుంటున్నా’ అని చెప్పింది.