సారా ఆలీఖాన్.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని దక్కించుకున్న క్రేజీ హీరోయిన్. సారా ఈ మధ్య ఓ భిన్నమైన ఫొటోను తన ఇస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటో తనదే. యోగా మ్యాట్‌పై కూర్చుని బెల్లీ ఫ్యాట్‌ని చూపిస్తూ తాను దిగిన ఫొటో అది. ఆ ఫోటోని షేర్ చేసి, ‘నిజంగా ఈ విషయంలో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను.
రీసెంట్ ఈవెంట్స్‌లో నా శరీర బరువు నన్ను చాలా ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యంగా నా బెల్లీ ఫ్యాట్. అది నాకు పెద్ద మైనస్. అందుకే దానిపై యుద్ధం ప్రకటించా’ అంటూ వెంటనే మరో ఫొటో షేర్ చేసింది. తను బెల్లీ ఫ్యాట్‌ని కరిగించి స్లిమ్ అయిన ఫొటో అది. రెండు వారాల్లో ఇంత మార్పా? అంటూ నెటిజన్స్ ఆ ఫొటోలు చూసి షాక్‌కి గురవుతున్నారు. ఏది ఏమైనా సారా నేటి యువతరంలో గొప్ప స్పూర్తినే నింపింది.