సప్తగిరి, శృతిపాటిల్ జంటగా నటిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. సురేష్ కోడూరి దర్శకుడు. వలసపల్లి మురళీమోహన్ నిర్మాత. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాలు మున్నంగి క్లాప్ కొట్టారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ నెల 21 నుండి రెగ్యులర్ షూటింగ్‌ను కర్నూల్లో ప్రారంభం కానుంది. 1990 నేపథ్యంలో రూ పొందనున్న ఈ సినిమాలో వినోదంతో పాటు అన్ని కమర్షియల్ అంశాలుంటాయి’అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రీధర్ నార్ల, మాటలు: జీవీవీకే చిరంజీవి (గోపీ).